publisherpro

వార్ 2 Vs కూలీ | ఎన్టీఆర్

 


వార్ 2 Vs కూలీ : బాక్సాఫీస్ వద్ద ఎవరు గెలిచారు?

బారి అంచనాలతో థియేటర్స్‌కి దిగిన వార్ 2 మరియు కూలీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించాయా అంటే సమాధానం స్పష్టంగా లేదు అనొచ్చు. రెండు సినిమాలు వచ్చి దాదాపు వారం అయిపోయింది, ఏ సినిమాకి రిజల్ట్ ఏంటో ఇప్పుడు అందరికీ క్లియర్. కాబట్టి వాటి మీద మనం విడివిడిగా విశ్లేషిద్దాం.


మొదటగా వార్ 2

ఈ సినిమా వరల్డ్‌వైడ్ 6 రోజుల్లో వచ్చిన  కలెక్షన్స్ దాదాపు ₹288 కోట్ల వరకు అంచనా. కానీ కనీసం ఇక్కడినుంచి మరో ₹100 కోట్లైనా రాకపోతే మోస్తరు హిట్ అని చెప్పలేం. అంటే ముందున్న దారి కాస్త కష్టం.

ఈ సినిమాలో Jr. NTR ఎంట్రీతో అంచనాలు గగనాన్నంటాయి. కానీ కథలో బలం లేకపోవడం, VFX, డబ్బింగ్ లో పస లేకపోవడంతో ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ మొదలైంది.

Jr. NTR ఒక బెస్ట్ యాక్టర్ అన్న విషయంపై ఎటువంటి సందేహం లేదు. రాజమౌళి గారు కూడా అనేక సార్లు ఆయన టాలెంట్ గురించి చెప్పారు. రాజమౌళి–NTR కాంబినేషన్ ఎప్పుడైనా వస్తే అది బ్లాక్‌బస్టర్ అవుతుందని అని మనందరికీ తెలుసు. RRR  సినిమా  Jr. NTR నటన ని దేశమంతా పరిచయం చేసింది. దేవరమూవీ తో దేశమంతా వచ్చిన ఫేమ్ ని కాపాడుకోవడంలో విజయవంతం అయ్యాడు.

కానీ ఇలాంటి సమయంలో ఒక చిన్నపాటి డైరెక్టర్‌తో  బోలీవుడ్‌లో లాంచ్ ఇవ్వడం మాత్రం తప్పు స్టెప్ అయింది. హృతిక్ రోషన్ ఉన్నప్పటికీ అదే స్పై యాక్షన్ జోనర్‌లో మునుపటి టైగర్ 3, ఫైటర్ లాంటి సినిమాలు ఫెయిల్ అయిన తరువాత మరోసారి అదే ఫార్ములాలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వటం పెద్ద రాంగ్ స్టెప్.

ఎండ్ ఆఫ్ ది డే – వార్ 2 ఒక ఫెయిల్యూర్ మూవీగా మిగిలిపోయింది.


ఇప్పుడు కూలీ

సినిమా టాక్ పక్కన పెడితే, ఈ సినిమాపై ఆసక్తి పెంచింది మాత్రం డైరెక్టర్ లోకేష్ విజయవంతమైన ట్రాక్ రికార్డ్. ఆయన గత విజయాల వల్లే కూలీపై ఎ norme అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులోకి సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంట్రీ కావడంతో అంచనాలు మళ్లీ డబుల్ అయ్యాయి. ట్రైలర్ నుండి రిలీజ్ వరకూ మాస్ ఆడియెన్స్‌కి బాగా నచ్చింది.

కానీ రిలీజ్ అయ్యాక ఏమైంది? నిజంగా చెప్పాలంటే సినిమా ఎవరికి పెద్దగా నచ్చలేదు. కథ, పాత్రలు, ఎమోషన్స్ – ఏదీ గట్టిగా కనెక్ట్ కాలేదు. సోషల్ మీడియాలో కూడా సినిమా కంటెంట్ గురించి కాకుండా కేవలం "హైప్" గురించి మాత్రమే చర్చ జరిగింది.

లోకేష్ దగ్గర స్టార్ కాస్ట్ చాలా పెద్దది – కానీ వారిని సరిగ్గా యూజ్ చేయలేకపోయాడు. ఒక్కో యాక్టర్‌కి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇవ్వలేకపోయాడు.

అయినా కలెక్షన్స్ మాత్రం మొదటి 6 రోజుల్లోనే దాదాపు ₹422 కోట్ల దాకా వచ్చాయి. కానీ ఇవన్నీ ప్రీ-రిలీజ్ హైప్ వల్లే. ఇప్పుడు హైప్ తగ్గుతున్న కొద్దీ కలెక్షన్లు కూడా స్లో అవుతున్నాయి.


ఫైనల్ గా

  • వార్ 2 : Jr. NTR టాలెంట్ ఉన్నప్పటికీ, బలహీన కథ, వర్కౌట్ కాని జోనర్ వల్ల ఫెయిల్యూర్.

  • కూలీ : కంటెంట్ లేకపోయినా రజినీకాంత్ కేరిజ్మా + లోకేష్ హైప్ వలన కలెక్షన్లు గట్టెక్కిన సినిమా.

రెండు సినిమాలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయి. కానీ ఎవరు కొద్దిగా మెరుగ్గా రాణించారు? అని అడిగితే సమాధానం కూలీ అని చెప్పాల్సిందే.


👉 మీరేమంటారు? కూలీ నిజంగా వర్కౌట్ అయ్యిందా? లేక హైప్ మాత్రమేనా?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు