publisherpro

Raja Raja Chora movie review| Telegu latest movie reviews

  రాజ రాజ చోరుడు నేర్పించిన పాఠం

RAJA RAJA CHORA MOVIE REVIEW


Covid 19 సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ సినిమా థియేటర్లు పూర్తిస్థాయిలో తెరవబడ్డాయి. సినిమా థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత , కొన్నిసినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. అందులో 19 ఆగస్టు గురువారం విడుదలైన శ్రీ విష్ణు నటించిన రాజ రాజ చోర మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

రాజా రాజా చొర సినిమా విషయానికొస్తే, సినిమా మొత్తం ఫుల్ ఎంట్రటైన్మెంట్ గా ఉంటుంది. కడుపుబ్బ నవ్వించే సీన్లు చాలా ఉన్నాయి. సినిమా ఎమోషనల్ గా కూడా చాలా బాగుంది. సినిమాలో నటించిన వాళ్ళందరూ తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.సినిమాలోని పాత్రలు నవ్విస్తూనే మంచి మెసేజ్ ను మనకు అందిస్తాయి.

ఇంక సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. కథానాయకుడి పాత్రలో శ్రీ విష్ణు గురించి అందరికీ తెలిసిందే, ఇంకోసారి తన నటనతో wow అనిపించాడు. ఇందులో గంగవ్వ పాత్ర చాలా బాగుంటుంది. హీరోయిన్ల ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతినాయకుడిగా రవిబాబు నవ్విస్తూ మెప్పించాడు.


ఈ సినిమాలో ప్రధాన పాత్రలు

భాస్కర్ ( శ్రీ విష్ణు) :

ఈ సినిమాలో శ్రీ విష్ణు ఒక జిరాక్స్ షాప్ లో పనిచేసే భాస్కర్ గా కనిపిస్తాడు. ఆలా జిరాక్స్ షాప్ లో పని చేస్తూ సాఫ్ట్వేర్ అని అబద్ధాలు చెబుతూ సంజన (మేఘా ఆకాశ్)ను మరియు తన భార్యను మోసం చేస్తాడు. అందుకోసం దొంగతనాలు చేస్తూ ఉంటాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాప పడతాడు. దీనిబట్టి అబద్దాలు చెప్పడం వల్ల ఎన్ని అనర్దాలు జరుగుతాయో మనకు నేర్పించాడు.

సంజన (మేఘా ఆకాశ్):

సంజన కూడా సాఫ్ట్వేర్ అని చెప్పుకుంటూ సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. శ్రీ విష్ణు ఏం చెప్పినా నమ్మే స్తుంది. చివరకు ఈ విష్ణు గురించి తెలిసి మోసపోయాను అనుకుంటుంది. సంజన పాత్ర బట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే విషయం నేర్పిస్తుంది.

విద్య (శ్రీ విష్ణు భార్య):

విద్యకు పెళ్లి ఇష్టం లేకపోయినా తన తండ్రి శ్రీ విష్ణుతో పెళ్లి చేస్తాడు. విద్యకు లాయర్ అవ్వాలని ఆశ.శ్రీ విష్ణు కు బ్లాక్ మెయిల్ చేస్తూ, పుట్టిన కొడుకు చదివిస్తూ తాను చదువుకుంటుంది. దొంగతనం కేసులో బుక్కయిన శ్రీ విష్ణు తెలివిగా విడిపిస్తుంది. ఈ పాత్ర బట్టి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇటు కుటుంబాన్నిఅటు చదువును మేనేజ్ చేస్తూ, దొంగ అని తెలిసినా భర్తను కాపాడుకుంటుంది.

విలియం (రవిబాబు):

           రవిబాబు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ ఐనా దొంగలతో చేతులు కలిపి దొంగతనాలు చేస్తూ, వాళ్ల దగ్గర షేర్ తీసుకుంటాడు. తన ప్రాణ స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇలా దొంగ అయిన శ్రీ విష్ణు తో దొంగ తనం చేయిస్తాడు , చివరకు పట్టుబడతాడు. దీనివల్ల ఎటువంటి వాడైనా చివరకు పట్టు పడాల్సిందే, మనది కాని దానికోసం ఆశపడితే మనది కూడా మనకు మిగలదు అని తెలుస్తుంది.


 అంజు ( గంగవ్వ):

ఈ సినిమాలో గంగవ్వ అద్భుతంగా నటించారు. నటించడమే కాక శ్రీ విష్ణు తో కామెడీ పండించారు. గంగవ్వ తన భర్త వదిలేసి వెళ్లిపోయినా తనకు తెలిసిన విద్య తో జీవనం సాగిస్తోంది. ఈ సినిమాలో గంగవ్వ పాత్ర హైలెట్.


సినిమా నేర్పిన పాఠం:   

                   అబద్ధాల చెప్పటం  వల్ల వచ్చే కష్టాలు, నిజం చెప్పడం వల్ల  వచ్చే  సంతృప్తి .

                                అబద్దం చెప్పడం వల్ల వచ్చేది ఏదైనా శాశ్వతం కాదు.


raja raja chora movie review


నారప్ప సినిమా నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు | Narappa movie Review | Telegu movies








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు