స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి ?
మన దేశం లో చాల మందికి స్టాక్ మార్కెట్ అంటే ఏమిటో తెలియదు. ఇంకొంత మందికి స్టాక్ మార్కెట్ లో ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలి ? అసలు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే నిజం గ లాభాలు వస్తాయా ? స్టాక్ మార్కెట్ చట్ట బద్దమైనదేనా ? అని చాల అనుమానులు ఉన్నాయ్. ఇంకా కొంతమందయితే స్టాక్ మార్కెట్ లాటరి ల భావించి రాత్రికి రాత్రే డబ్బు సంపాదించాలి అని వచ్చి నష్టాలు ముఠా కట్టు కుంటారు .అయితే స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ గురించి క్లుప్తంగా:
స్టాక్ మార్కెట్ అంటే కంపెనీస్ యొక్క షేర్స్ ని కొనటం, అమ్మటం. మనం ఎలా అయితే సాధారణ మార్కెట్లో కొనటం అమ్మటం చేస్తామో ఆలాగే కంపెనీస్ కి సంబంచిన షేర్స్ ని కొనటం అమ్మటం చేస్తాం.కొన్నవారిని buyers అని అమ్మిన వారిని sellers అంటారు.స్టాక్ మార్కెట్లో షేర్స్ కొనాలి అమ్మాలి అంటే మనం Demat అకౌంట్ కలిగి ఉండలి.మనం demat అకౌంట్ open చెయ్యాలి అనుకుంటే మార్కెట్ చేలా brokerages ఉన్నాయ్ వాటిలో మీకు నచ్చిన బ్రోకరేజ్ లో మీరు demat అకౌంట్ open చేస్కోవచ్చు.
షేర్స్ ఎక్కడ కొనాలి ?
మనం కూరగాయలు కొనటానికి ఎలా అయితే మార్కెట్ కి వెళ్తామో అలాగే Demat అకౌంట్ open చేసిన తర్వాత మనం షేర్స్ ఎక్కడ కొనాలి అంటే స్టాక్ ఎక్స్చేంజి లో కొనాలి. మన ఇండియా లో ముక్యముగా రెండు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయ్ NSE (national stock exchange) మరియు BSE (Bombay Stock Exchange). BSE 1875 లో మొదలైనది ఇందులో మొత్తం 5000 కంపెనీలు లిస్ట్ ఆయున్నాయి.Nse 1992 లో మొదలైనది ఇందులో 2000 కంపెనీస్ లిస్ట్ ఆయాయ్యి. షేర్స్ nse లో కొన్న bse లో కొన్న షేర్ యొక్క ధర మారదు.
స్టాక్స్ కు షేర్స్ కు మధ్య తేడా ?
మన అందరికి ఒక చిన్న అనుమానం ఉంటది స్టాక్ మార్కెట్ అనాలా లేదా షేర్ మార్కెట్ అనాలా అని అసలు స్టాక్స్ అంటే ఏమిటి ? షేర్స్ అంటే ఏమిటి ?
స్టాక్స్ :కొన్ని కంపెనీల యొక్క షేర్ లను కలిపి స్టాక్స్ అంటారు.
షేర్స్ :ఒకే కంపెనీ కి చెందిన కొన్ని షేర్స్ ని శ్రేస్ అంటారు.
స్టాక్ మార్కెట్ లో షేర్స్ ఎలా కొనాలి ?
మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అని నిర్ణయించుకుని డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తరువాత మీరు ఎంచుకున్న బ్రోకరేజ్ మీకు నచ్చిన కంపెనీ షేర్స్ కొనవచ్చు.మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటె చాలు కానీ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు దాని గురించి చాల తెలుసుకుని ఇన్వెస్ట్ చెయ్యాలి. స్టాక్ మార్కెట్ లో రాత్రికి రాత్రే డబ్బు రాదు. ఏదయినా కంపెనీ యొక్క లో ఇన్వెస్ట్ చెయ్యాలి అనుకున్నపుడు ఆ కంపెనీ గురించి పూర్తిగా అనాలిసిస్ చెయ్యాలి.
0 కామెంట్‌లు