తెల్లవారి వేగంగా నిద్ర లేవటం ఎలా ?
మనలో చాల మంది తెల్లవారి వేగంగా లేచి exercise చెయ్యాలి , meditation చెయ్యాలి లేదా స్టూడెంట్స్ అయితే చదువుకోవాలి అనుకుంటారు.కానీ అది అనుకోవటానికి మాత్రమే పరిమితం అవుతుతోంది అల అనుకున్న వారిలో 80% మంది చెయ్యలేరు . వేగంగా లేవాలి అని అలారం పెడతాం కానీ అది మ్రోగే సరికి దాన్ని ఆపుచెయ్యటమో లేదా జోల పాట ల భావించి అలాగే నిద్రపోతాం. ఇలా నిద్ర లేవకపోటానికి చాలా కారణాలు చెప్తాం.ఏదయినా మనం నిద్రం లేవటనికి యుద్ధం చేస్తాం అని చెప్పొచ్చు.
తెల్లవారి వేగంగా లేవటం వల్ల ప్రయోజనాలు:
తెల్లవారి సూర్యోదయం కి రెండు గంటల ముందు అంటే దాదాపు 4am నుండి 6am కాలాన్ని బ్రహ్మమూర్తం( టైం అఫ్ ది గాడ్ ) అంటాం.ఆ సమయంలో ఆల్ఫా వేవ్స్ అనేవి ఉంటాయి. మిగతా రోజు మొత్తం గామా వేవ్స్ ఉంటాయి. అంతే కాకుండా ఆ సమయం లో మన మైండ్ ఖాళీగా ఉంటుంది.ఆ సమయం లో రెండు గంటలు చదివిన మాములు సమయంలో 8 గంటలు చదివినట్టు. తెల్లవారి వేగం గ లేచే వాళ్ళు pro active, positive ఉంటారు. వేగంగా లేవటం వల్ల creativity పెరుగుతుంది.అంతే కాదు వేగంగా లేచే వాళ్ళు ఎంతో focused గా ఉంటారు. అందువల్లే ముకేశ్ అంబానీ, విరాట్ కోహ్లీ , అబ్దుల్ కలం వంటి ప్రముఖులు ఏదిఏమైనా తెల్ల వారి వేగంగా లేవటం అనేది ఒక అలవాటుగా చేస్కుంటారు. ముఖ్యంగా బ్రహ్మమూర్తం లో లేవటం వల్ల ఆధ్యాతికంగా , మానసికంగా , భౌతికంగా చాల అభివుద్ది చెందుతారు.
తెల్లవారి వేగంగా నిద్ర లేవటం ఎలా ?
1.Sleep early :
ఇది అందరికి తెలిసిందే వేగంగా నిద్ర లేవాలి అంటే వేగంగా నిద్ర [పోవాలి అని కానీ ఈ ఆధునిక ప్రంపంచలో ఎవరు వేగం పడుకుంటున్నారు. టీవీ చూడటం లేదా అర్దరాత్రి వరకు ఫోన్ లో చాటింగ్ చెయ్యటం చేసి పొద్దున్న వేగంగా లేవటం అంటే అది కుదరని పని. వేగంగా లేవాలి అంటే electronics అన్ని కనీసం నిద్రకు అరగంట ముందు ఆపేయాలి. ఎందువల్ల అంటే ఈ ఎలక్ట్రానిక్స్ నుండి blue light మనం నిద్ర పోవటానికి ఉపయోగపడే melatonin అనే హార్మోన్ సరిగ్గా release అవ్వక సరైన నిద్ర పట్టదు. సాధారణంగా ఈ melatonin 10pm నుండి 11pm మధ్యలో పడుకుంటే బాగా release అవుతుంది. అందువల్ల ఈ మధ్య కలం లో పడుకుంటే మంచి quality నిద్ర పడుతుంది. అందువల్ల మీరు 9 pmకు మొబైల్ ,tv లేదా laptops చూడటం ఆపేయాలి.
2.నిద్రకు ముందు ఇవి పాటించండి:
రాత్రి Dinner తక్కువ గా తీసుకోండి. Fast food మరియు Junk food కి No చెప్పండి.డిన్నర్ చేసాక ఎలక్ట్రానిక్స్ ఆపేసి గ్లాస్ వేడి పాలు తాగి ఏదయినా మీకు ఇష్టమైన బుక్ చదువుతూ లేదా మంచి మ్యూజిక్ వింటూ పాడుకోవాలి. ముఖ్యంగా మీరు గుర్తుచుకోవాల్సిన విషయం సాయంత్రం సమయంలో కాఫీ ,టీ వంటి కెఫిన్ ఉండే వి త్రాగక పోవటం చాల మంచిది. Afternoon సమయంలో ఎక్కువగా నిద్ర పోవటం కూడా మంచిది కాదు. మీరు ఎట్టి పరిస్థిలులో కూడా North వైపు తలా పెట్టుకుని పడుకోవద్దు. ఎడమ వైపుకి పడుకోవాలి. ఇలా చేస్తే మంచి నిద్ర పడుతుంది.
3. మీ మైండ్ ని వేగంగా లేవాలి అని ప్రిపేర్ చెయ్యండి :
మీరు ఎప్పుడైనా గమనించారా ఏదయినా Special గా occasion ఉన్నపుడు, Train లేదా bus తెల్లవారి 4 గంటలకు ఉన్నపుడు మనకు తెలియయకుండానె మనం ఆర్ లారం కన్నా ముందే నిద్రలేస్తాం.ఎందుకంటే మన మైండ్ ఆవిడం గ ప్రిపేర్ చేస్తాం అందువల్ల మనం అలారం వచ్చే ముందు మన subconscious mind మనల్ని నిద్రలేచేలా చేస్తుంది.ఇలా సాధారణ రోజులలో జరగాలి అంటే మీరు పడుకునే ముందు ఒక 10 సార్లు అనుకొండి.మీరు ఎంత టైం కు లేవాలి అనుకుంటున్నారో ఉదాహణ కు మీరు ఉదయం 5 గంటలకు నిద్ర లేవాలి అనుకుంటే నేను ఎట్టి పరిస్థితులలో అయినా 5 గంటలుకు నిద్రలేస్తా అని ఒక 10 సార్లు అనుకోండి.ఇలా చేయటం వల్ల మీ subconscious mind మిమల్ని ఆ సమయం లో నిద్ర లేపుతుంది.
4.నిద్ర లేచిన తర్వాత:
మనలో చాల మంది అలారం వచ్చినపుడు నిద్ర లేస్తారు కానీ దాన్ని ఆపేసి మల్లి నిద్రపోటం లేదా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతాం.ఇలా జరగకుండా ఉండాలి అని అంటే మన అలారం మన బెడ్ కు వీలైనంత దూరం గా ఉండాలి. అలారం sound కు లేచిన వెంటనే అలారం off చెయ్యకుండా మీ రెండు చేతులు బాగా rub చేసి మీ కళ్ళకు హత్తుకోండి. తర్వాత వెంటనే బెడ్ సరిచేసి ఫ్రెష్ అయ్యి వేడి నీళ్లు పెట్టు కుని త్రాగండి.ఈ విధంగ చెయ్యటం వాళ్ళ మల్లి నిద్రపోకుండా మీ day ని active గా ప్రారంభిస్తారు .కాలకుత్యాలు తీర్చుకుని చదవటం లేదా యోగ ,వాకింగ్ ,మెడిటేషన్ వంటివి అలవాటు చేస్కోండి. ఉదయం వేగం గ నిద్ర లేచి ఇవన్నీ చెయ్యటం వల్ల మీరు ఎంతో HEALTHY AND WEALHY గా ఉంటారు. ఇలా మీరు 21 days చేస్తే మీకు అలాటుఅవుతుంది. ఏదయినా ఒక పనిని కంటిన్యూస్ గా 21 రోజులు చేస్తే అది మనకు అలవాటుగా మారుతుంది.
0 కామెంట్లు